News January 7, 2026
నిర్మల్: యాక్సిడెంట్.. యువకుడి మృతి

అంత్యక్రియలకు వచ్చి వెళ్తుండగా యువకుడు మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సపూర్(జి)కి చెందిన నితిన్(21) HYDలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామంలో బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు బైక్‌పై నిర్మల్ బయలుదేరాడు. రహదారిపై అటవీ జంతువు అడ్డురావడంతో తప్పించబోయి కిందపడ్డాడు. నిఖిల్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 7 నుంచి 9 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 4 నుంచి 5 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
News February 11, 2026
కొత్త కార్పొరేషన్లతో కొత్త సమీకరణాలు

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు కన్పించబోతున్నాయి. కొత్త GHMCలో చాలా జోన్లలో AIMIM ఆధిపత్యం, సైబరాబాద్‌లో ఆంధ్రా వ్యాపారులు ప్రభావం చూపుతారని విశ్లేషకుల అంచనా. ఇక మల్కాజిగిరి కార్పొరేషన్‌లో WGL, కరీంనగర్, NLG, MDK సహా తెలంగాణ జిల్లాల ప్రజల ప్రాబల్యం కన్పిస్తుంది. దీంతో ఆయా కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందుకు తగ్గట్లు పార్టీల, ప్రాంతాల కొత్త రాజకీయ శక్తులు, అవకాశాలు వస్తాయి.
News February 11, 2026
బ్లాక్ బీన్స్‌తో కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?

✦ ఫైబర్, పొటాషియం, ప్రొటెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్లు గుండె హెల్త్‌ను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
✦ రిచ్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
✦ అధిక ఫైబర్, ప్రొటీన్లు ఆకలిని కంట్రోల్ చేస్తాయి. దీంతో హెల్తీగా బరువు తగ్గుతారు.
✦ యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
✦ ప్రొటీన్లు బాడీలోని టిష్యూస్‌ను రిపేర్ చేస్తాయి.
✦ ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ ఆరోగ్యంగా ఉంచుతాయి.


