News January 7, 2026
నల్గొండ: బైకర్లూ.. హెల్మెట్ల బూజు దులపండి!

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Similar News
News February 20, 2026
నల్గొండ: ఇక అందరి దృష్టి MPTC, ZPTC ఎన్నికలపైనే!

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే GPలు, పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి MPTC, ZPTC ఎన్నికలపై పడింది. త్వరలోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలతో రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 353 MPTC, 33 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
News February 20, 2026
నల్గొండలో చెరువుల నవీకరణకు మోక్షం!

పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ 2.0’ పథకం జిల్లాలో వేగవంతం కానుంది. ఈ పథకం కింద ఎంపిక చేసిన చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో, పనులు ప్రారంభించేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని తొమ్మిది చెరువులను తొలిదశలో ఎంపిక చేసి, వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.22.35 కోట్లను కేటాయించింది.
News February 20, 2026
NLG: హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి!

జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో దస్రూ నాయక్ తెలిపారు. పరీక్షల సరళిపై ఇప్పటికే అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 27,905 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్ హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారని తెలిపారు.


