News January 7, 2026

ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 103 పోస్టులకు నోటిఫికేషన్

image

ఎయిమ్స్ రాయ్‌బరేలి 103 Sr. రెసిడెంట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ (MD/MS/DNB/DM/M.Ch)ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గలవారు JAN 9, 23, FEB 6, 20తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.67,700+NPA చెల్లిస్తారు. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. https://aiimsrbl.edu.in/

Similar News

News February 2, 2026

ఐసీసీ టోర్నీల్లో గతంలోనూ బహిష్కరణలు

image

భారత్‌తో జరగాల్సిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను పాక్ ప్రభుత్వం బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నీలలో మ్యాచ్‌లు రద్దవ్వడం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1996 వరల్డ్‌కప్‌లో భద్రతా కారణాలతో శ్రీలంకలో ఆడేందుకు ఆసీస్, వెస్టిండీస్ నిరాకరించాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. 2003 WCలో జింబాబ్వేతో మ్యాచ్‌ను ఇంగ్లండ్, కెన్యాతో మ్యాచ్‌ను న్యూజిలాండ్ బహిష్కరించాయి.

News February 2, 2026

రెబల్‌గా పోటీ చేస్తే 15 ఏళ్లపాటు సస్పెన్షన్: రాంచందర్ రావు

image

TG: మున్సి‘పోల్స్’లో పార్టీ B ఫారం పొందిన వారే పోటీలో ఉండాలని, పార్టీ ఇతర నేతలు బరి నుంచి తప్పుకోవాలని TBJP చీఫ్ రాంచందర్ రావు సూచించారు. పోటీలో కొనసాగే రెబల్స్‌ను 15 ఏళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అనేక సర్వే నివేదికల ఆధారంగా గెలిచే వారినే అభ్యర్థులుగా పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. టికెట్లు రాని వారికి పార్టీ పరంగా పదవులు ఇస్తామని వివరించారు.

News February 2, 2026

అన్నిటికీ నేనే మాట్లాడాలా? మరి మీరెందుకు: పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం

image

AP: పార్టీ నేతలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదని మండిపడ్డారు. ‘అన్నిటికీ నేనే మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు? వైసీపీ దుష్ప్రచారంపై మీరు మాట్లాడాలి కదా?’ అని నిలదీశారు. మహిళల విషయంలో పార్టీనేతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.