News January 7, 2026

MDK: తండ్రిని సుత్తి, కర్రతో కొట్టి చంపాడు!

image

పాపన్నపేట మం.లో తండ్రిని <<18777311>>కొడుకు చంపిన<<>> విషయం తెలిసిందే. వివరాలు.. సీతానగర్‌కి చెందిన లక్ష్మయ్య(45) వ్యవసాయంతో పాటు లైన్‌మెన్ వద్ద హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. భార్య శేఖమ్మతో పాటు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు శ్రీకాంత్ పెళ్లికి, వ్యవసాయానికి అప్పులు అయ్యాయి. ఈ క్రమంలో శ్రీకాంత్‌కు తండ్రికి డబ్బుల విషయంలో గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి శ్రీకాంత్ సుత్తి, కర్రతో తండ్రిని తలపై కొట్టడంతో మృతి చెందాడు.

Similar News

News February 23, 2026

అన్నమయ్య: 40 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి పరార్

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మైనర్ అదృశ్యం కలకలం రేపింది. సీఐ వెంకటేశులు వివరాల మేరకు.. మండలంలోని నాయనిచెరువుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(40)కి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయనకు 17 ఏళ్ల యువతితో పరిచయమైంది. ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి యువతి కనిపించడం లేదు. ప్రేమ పేరుతో యువతి ఆ 40 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తమకు తెలిసిందని సీఐ తెలిపారు.

News February 23, 2026

చిన్నవయసులోనే వృద్ధాప్యమా?

image

వయసుతోపాటు వృద్ధాప్యం రావడం సహజమే కానీ చిన్నవయసులోనే ఈ లక్షణాలు కనిపించడం ఈ మధ్య ఎక్కువవుతోంది. దీనికి జెనెటిక్స్‌తో పాటు మరిన్ని కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఒత్తిడి, నిద్ర, ఆహారం, లైఫ్‌స్టైల్, అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం దీనికి కారణాలు. పోషకాహారం, తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌, విటమిన్‌ C, నియాసినమైడ్‌ సీరమ్‌ వాడాలని సూచిస్తున్నారు.

News February 23, 2026

పల్నాడులో ఇంటర్ పరీక్షలకు కౌంట్‌డౌన్..!

image

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతి లేదని పేర్కొన్నారు.