News April 25, 2024

చింతమనేనికి బీ ఫామ్

image

AP: ఎమ్మెల్యే అభ్యర్థులకు TDP చీఫ్ చంద్రబాబు బీ ఫామ్‌లు అందజేశారు. దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, నరసరావుపేట అభ్యర్థి చదలవాడ అరవిందబాబుతోపాటు మరికొందరికి బీ ఫామ్‌లు ఇచ్చారు. దెందులూరును BJPకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ TDP అభ్యర్థి చింతమనేనికే బీ ఫామ్ ఇచ్చారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫామ్ అందించారు. ఆరోజు పలు కారణాలతో14 మంది బీ ఫామ్‌లు తీసుకోలేదు.

Similar News

News March 18, 2026

SDPT: పంట ఎండిపోతోందని మనస్తాపంతో రైతు సూసైడ్

image

సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుండటం చూడలేక, అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దుబ్బాక మండలం రాగోత్తంపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నారెడ్డి మోహన్ రెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. నీరు అందక పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 18, 2026

‘షోలే x 100’: ధురంధర్-2పై RGV రివ్యూ!

image

‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను చూసిన డైరెక్టర్ RGV ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ ‘షోలే’ కంటే 100 రెట్లు గొప్పదని, దీని ముందు ‘మొఘల్-ఎ-ఆజమ్’ వంటి క్లాసిక్స్‌ కూడా TV సీరియల్స్‌లా కనిపిస్తాయన్నారు. సినిమా ప్రపంచంలో ఇది కొత్త శకానికి నాంది అన్నారు. హాలీవుడ్ దిగ్గజాలు స్పీల్‌బర్గ్, నోలన్ సైతం పనులు పక్కన పెట్టి ఈ సినిమా చూడాలని సలహా ఇచ్చారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ టాలెంట్‌ను ఆకాశానికెత్తేశారు.

News March 18, 2026

ఐటీ స్టాక్స్‌ కొనుగోలు.. మార్కెట్లకు లాభాలు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 600 పాయింట్ల లాభంతో 76,671కు చేరగా నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,796 వద్ద సెటిల్ అయింది. ఐటీ షేర్లలో కొనుగోలు, సీహన్ పోర్టు మీదుగా ఇరాక్ ఆయిల్ ఎగుమతికి తుర్కియే అంగీకరించడంతో చమురు ధరలు కంట్రోల్‌లో ఉండటం, ఇతర రంగాల్లోనూ వాల్యూ బయింగ్ కలిసొచ్చింది. టెక్ మహీంద్రా, ఎటర్నల్, ఇన్ఫోసిస్ 3% లాభాలు నమోదు చేశాయి.