News January 7, 2026

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 84,920 వద్ద.. నిఫ్టీ 56 పాయింట్లు క్షీణించి 26,122 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టైటాన్, ఇన్ఫీ, HCL, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు లాభాల్లో.. TMPV, HDFC, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

Similar News

News February 5, 2026

శారీరక అంగీకారం వేధింపులకు లైసెన్స్ కాదు: HC

image

శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన వేధింపులకు అనుమతి ఇచ్చినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో నిందితుడి బెయిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో సంబంధం కొనసాగిందన్న వాదనను తోసిపుచ్చింది. అంగీకారం ఉన్నా లైంగిక దాడులు నేరమేనని తెలిపింది. ఏకాంత వీడియోలు తీసి బలవంతం చేయడం ఏకాభిప్రాయం కిందకు రాదని తేల్చి చెప్పింది.

News February 5, 2026

డ్రీమ్‌లైనర్ ఫ్యూయల్‌ స్విచ్‌పై ఎయిర్ ఇండియా క్లారిటీ

image

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో ఫ్యూయల్ స్విచ్ సమస్యలు లేవని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. లండన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ ఫ్లైట్‌లో స్విచ్ లోపం ఉందని వస్తున్న వార్తలపై బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వివరణ కోరింది. దీనిపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ నెల 2న పైలట్ ఫ్యూయల్ స్విచ్ సరిగా లాక్ కాకపోవడంతో విమానాన్ని బెంగళూరులో నిలిపివేశారు. తనిఖీలు చేయగా లోపాలేవీ లేవని ఎయిర్ ఇండియా తెలిపింది.

News February 5, 2026

విటమిన్ E నేరుగా అప్లై చేస్తున్నారా?

image

ముఖంపై పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి చాలామంది విటమిన్ E క్యాప్య్సూల్స్ వాడుతుంటారు. అయితే వీటిని నేరుగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వీటిని ముఖంపై డైరెక్ట్‌గా వాడితే అలర్జీ, ర్యాషెస్ రావొచ్చంటున్నారు. ఈ క్యాప్య్సూల్స్‌ నోటి ద్వారా తీసుకోవడానికి ఉద్దేశించినవని చెబుతున్నారు. కచ్చితంగా వీటిని వాడాలనుకుంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.