News April 25, 2024

కేరళలో భట్టి ఎన్నికల ప్రచారం

image

TG: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాలఘాట్ జిల్లాలోని అలత్తూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమ్య హరిదాస్ తరఫున ఆయన ప్రచారం చేశారు. అక్కడి ప్రజలతో మమేకమవుతూ ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాగా భట్టికి పాల్‌ఘాట్ డీసీసీ అధ్యక్షుడు తంగప్పన్ ఘనస్వాగతం పలికారు.

Similar News

News January 14, 2026

బంగ్లా ఎన్నికలపై మైనార్టీల్లో భయాందోళనలు

image

బంగ్లాదేశ్‌లో FEB 12న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో పాల్గొనడంపై మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్యతా మండలి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్‌ను కలిశాయి. భద్రతపై ప్రజల ఆందోళనను తెలియజేశాయి. ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరాయి.

News January 14, 2026

గంగిరెద్దుల విన్యాసాలు – పల్లెటూరి సందడి

image

సంక్రాంతి వేళ పల్లె వాకిళ్లలో గంగిరెద్దుల సందడి ఉంటుంది. చక్కగా అలంకరించిన ఎద్దును ఇంటింటికీ తిప్పుతూ, డోలు సన్నాయి వాయిద్యాల మధ్య విన్యాసాలు చేయిస్తారు. ‘అయ్యగారికి, అమ్మవారికి దండం పెట్టు’ అనగానే ఆ ఎద్దు తల ఊపుతూ అభినయించడం ముచ్చటగా ఉంటుంది. శివుని వాహనమైన నందిగా భావించి, ప్రజలు వీటికి పాత బట్టలు, ధాన్యం దానం చేస్తారు. గంగిరెద్దులు ఇంటికి రావడం లక్ష్మీప్రదమని, పశుసంపద వృద్ధి చెందుతుందని నమ్మకం.

News January 14, 2026

IISER తిరుపతిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) 22 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, MBBS, MD, PG, MSc, MCA, BS-MS, M.LSc, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్/స్కిల్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iisertirupati.ac.in