News January 7, 2026
KNR: కల్తీ ఫుడ్ పై కంట్రోల్ ఏది?

ఉమ్మడి KNR జిల్లాలో కల్తీ నూనె, మసాలాలు, టేస్టీ సాల్ట్ సింథటిక్ కలర్స్ విచ్చలవిడిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. 2025-AUG-25న టాస్క్ ఫోర్స్ బృందం ‘మిఠాయి వాలా’, ‘మైత్రి’, ‘అనిల్ స్వీట్స్’లలో తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించింది. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదు. రెగ్యులర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు కరువయ్యాయి. ఇప్పటికైనా రెగ్యులర్ ఆఫీసర్స్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News January 13, 2026
ప.గో: కోడి పుంజులకు ప్రత్యేక వసతులు

గోదావరి జిల్లాలో ఏటా సంక్రాంతి పర్వదినాల్లో కోడిపందేలు జరుగుతుంటాయి. కోడిపుంజుల కోసం వీరవాసరంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోళ్లకు ఎండ తగలకుండా షామియానా టెంట్, ఒకో గంపలో ఒకో పుంజును ఉంచి ఎండ తగలకుండా రక్షణ కల్పిస్తున్నారు. బరులను సిద్దం చేసే పనులు కనిపించకుండా గ్రీన్ షీట్లు కడుతున్నారు.
News January 13, 2026
కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC

శునకాల నియంత్రణలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఎవరికైనా కుక్క కరిచి మరణిస్తే భారీ పరిహారం అందించేలా ఆదేశిస్తామని స్పష్టం చేసింది. కాగా ఏకపక్షంగా కాకుండా, సమగ్ర పరిష్కారం చూపాలని డాగ్ లవర్స్ SCని కోరారు. ప్రజలు వాటిని దత్తత తీసుకునేలా ఇన్సెంటివ్స్ ప్రకటించాలని సూచించారు. దీంతో అనాథలు, రోడ్లపై అభాగ్యులకు ఇది చేయొచ్చుగా? అని ధర్మాసనం ధ్వజమెత్తింది.
News January 13, 2026
ముగ్గులతో ఆరోగ్యం..

సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు కనువిందు చేస్తుంటాయి. హేమంతరుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం, గొబ్బెమ్మలను పెట్టడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది.


