News January 7, 2026
అల్లూరి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలి

అల్లూరి, పోలవరం జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపు కార్యక్రమాలను సమగ్ర సమాచారంతో చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారుల ఈ-కేవైసీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News February 9, 2026
ఏపీలో పెరుగుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు

AP: రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నట్లు పాపులేషన్ మేనేజ్‌మెంట్ సర్వేలో వెల్లడైంది. సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 14.9%, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12% కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీలు రికార్డయినట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అత్యల్పంగా విశాఖలో 3.96%గా ఉంది.
News February 9, 2026
KMR: రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతి (UPDATE)

కామారెడ్డి పట్టణంలోని రైల్వే <<19085331>>ట్రాక్‌పై గుర్తు తెలియని ఓ మహిళ మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ మహబూబ్ నగర్ జిల్లా వెంగళపల్లెకు చెందిన మీరిగల్ల సరోజనమ్మ(75)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 9, 2026
వైకుంఠ పరివారమే ఈ చతుర్విధ అవతారాలు!

ధర్మ సంస్థాపన కోసం విష్ణువు త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడు. అయితే విష్ణువు ఒక్కడే కాకుండా ఆయనకు నిరంతరం తోడుగా ఉండే ఆయుధాలు, వాహనం కూడా రాముని సోదరులుగా జన్మించాయి. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కాగా ఆయనకు నీడలా ఉండే లక్ష్మణుడు విష్ణువు శయ్య అయిన ఆదిశేషుడి అంశతో జన్మించాడు. భరతుడు విష్ణువు చేతిలోని పాంచజన్యం(శంఖం) అవతారం. శత్రుఘ్నుడు దుష్టసంహారానికి వాడే సుదర్శన చక్రం అంశతో జన్మించాడు.


