News April 25, 2024

చాలామంది మహిళలకు నరకం ‘PCOD’

image

యూపీ టెన్త్‌ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన బాలిక ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటాన్ని పలువురు ట్రోల్ చేశారు. ఆ పరిస్థితిని PCOD అంటారని వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా తలెత్తే ఈ ప్రాబ్లమ్ వల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, అధిక రక్తస్రావం, బరువు పెరగడం వంటి పలు ఇబ్బందుల్ని PCOD మహిళలు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి వీలైతే అండగా ఉండాలి తప్ప గేలి చేయడం సరికాదని సూచిస్తున్నారు నిపుణులు.

Similar News

News March 24, 2026

డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలి: రేవంత్

image

TG: దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని BJP అనుకుంటోందని CM రేవంత్ ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TV9 సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘ఏ లెక్క ప్రకారం 50% సీట్ల పెంపు ఉంటుంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికే నష్టం. సీట్ల పెంపుపై చర్చ జరగాలి. 50% పెంపులోనే కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు.

News March 24, 2026

IPL నుంచి తప్పుకున్న ENG బ్యాటర్!

image

IPL-2026 నుంచి ENG బ్యాటర్ బెన్ డకెట్(DC) తప్పుకున్నట్లు CricBuzz వెల్లడించింది. ఇంటర్నేషనల్ కెరీర్‌పై ఫోకస్ చేసేందుకు ఆయన IPLను స్కిప్ చేస్తున్నట్లు సమాచారం. BCCI రూల్ ప్రకారం ఆయనపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఆక్షన్‌లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. అటు CSKలోకి నాథన్ ఎల్లిస్ స్థానంలో AUS పేసర్ స్పెన్సర్ జాన్సన్ రానున్నారు.

News March 24, 2026

ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా: CM రేవంత్

image

TG: దేశ రాజకీయాల్లో తాను పని చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇంకా ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని టీవీ9 సమ్మిట్‌లో స్పష్టం చేశారు. రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడు పేరు గడించారని, తెలంగాణలో ఉన్న విలన్ల వల్లే ప్రజలు తనను హీరో చేశారని పేర్కొన్నారు. 2034 వరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఉంటానన్నారు. తాను నాయకుడిని కాదని, కార్యకర్తల స్నేహితుడినని చెప్పారు.