News January 7, 2026
సిరిసిల్ల: ఇస్రో శాస్త్రవేత్తగా గంభీరావుపేట వాసి.. కేటీఆర్ అభినందనలు

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన సాయి చరణ్ ఇస్రో పరిధిలోని ఎన్ఆర్ఎస్సీలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సాయి చరణ్ స్నేహితుడు ‘ఎక్స్’ వేదికగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి సాయి చరణ్‌కు శుభాకంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు ఎంపికైన సాయి చరణ్, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News February 2, 2026
BREAKING: వరంగల్‌లో కిడ్నాప్ కలకలం

వరంగల్ కొత్తవాడలో సోమవారం సాయంత్రం ఓ బాలుడి(13)పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడ్డారని అతని తల్లి ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరణాకర్ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 2, 2026
కృష్ణా: ‘విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి’

పెనమలూరు నియోజకవర్గం పోరంకి BJR నగర్‌లోని చైతన్య విద్యా సంస్థల్లో పవన్ అనే విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన PGRSలో జిల్లా అధ్యక్షులు పూజిత, కార్యదర్శి సమరం కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. తోటి విద్యార్థుల ముందు పవన్‌ను ప్రిన్సిపల్ అవమానకరంగా మాట్లాడినందుకు ఆత్మహత్య చేసుకున్నాడని SFI నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
News February 2, 2026
పోలీస్ శాఖ పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు: ఎస్పీ

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. సోమవారం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన పాల్గొని ప్రజల నుంచి 23 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో పాటు సైబర్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.


