News April 25, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థిగా షాహీన్ నామినేషన్ దాఖలు

image

హిందూపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున షాహీన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబుకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. సాదాసీదాగా ఆయన నామినేషన్ కార్యక్రమం కొనసాగింది. సినీయర్ నాయకుడు బాలాజీ మనోహర్ ఆయన వెంట వచ్చారు.

Similar News

News January 21, 2026

జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బాధ్యతల స్వీకరణ

image

అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తనకు, జిల్లా స్థాయి ఉన్నత పదవి కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరించి, విద్యార్థులకు, పాఠకులకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News January 21, 2026

రైతుల పాలిట కనక వర్షంగా మారిన దానిమ్మ పంట

image

అనంతపురం జిల్లాలో పండిస్తున్న దానిమ్మ పంట రైతుల పాలిట కనక వర్షం కురిపిస్తోంది. కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లేక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్ని కావు. నేడు నాణ్యతను బట్టి టన్ను దాదాపు రూ.1.50 లక్షలకు పైగా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పుట్లూరు మండలం బాలాపురంలో రైతు సుదర్శన్ రెడ్డికి చెందిన తోటలో ఒక్కో దానిమ్మ కాయ 0.830 గ్రాముల బరువు దిగుబడి రావడం విశేషం.

News January 20, 2026

ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

image

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.