News April 25, 2024
MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్

CM రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మహబూబ్‌నగర్ BJP అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక సీఎంగా ఉన్న రేవంత్ ఆరు సార్లు వచ్చారు. అంటే కాంగ్రెస్‌కు ఓటమి భయం మొదలైందని అన్నారు. రేవంత్ రెడ్డికి తాను పోటీ కానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.
Similar News
News April 24, 2025
వనపర్తి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్‌లోని రైస్ మిల్లులో 160 కేవీ పనులకు సంబంధించి బిల్లును అప్రూవ్ చేయాలని కాంట్రాక్టర్ సలీం సదరు ఏఈ కొండయ్యను కోరగా రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వనపర్తి విద్యుత్ కార్యాలయంలో కొండయ్య రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏఈని నాంపల్లి కోర్టుకు తరలిస్తామని చెప్పారు.
News April 24, 2025
MBNR: ‘భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలి’

జిల్లాలో భూగర్భ జిల్లాలో అడుగంటకుండా వాటిని పెంచేందుకు వర్షపు నీటి సంరక్ష నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో నీటి నియంత్రణపై ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలో పలు సూచనలు చేశారు. నీటి సంరక్షణ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు అందరికీ అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు.
News April 24, 2025
మిడ్జిల్: వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

మిడ్జిల్ మండల్ మల్లాపూర్‌లో నేడు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వడ్ల తేమ శాతం చూశారు. రైతులతో మాట్లాడుతూ.. సన్నాళ్లకు బోనస్ అందుతున్నాయా అని, తేమ శాతం వచ్చే విధంగా ఆరబెట్టాలని, రైతులకు కల్లాలకు స్థల పరిశీలన, సరిపడా టార్పాలిన్ ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో, ఏపీఎంకి సూచించారు.