News January 7, 2026
పిడికిలెత్తిన బిక్కనూర్.. తగ్గేదేలే..!

‘ఫార్మా హటావో – బిక్కనూర్ బచావో’ అంటూ నినదిస్తూ సాగిన భారీ ర్యాలీ కాసేపటి క్రితమే ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకుంది. బిక్కనూర్ కమాన్, గాంధీ చౌక్ నుంచి బయలుదేరిన జనం, దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు. <<18785446>>కంపెనీ ప్రాంగణానికి<<>> చేరుకుని తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. ‘మా ఊరు- మా ఊపిరి’ అంటూ గళం వినిపిస్తుండగా అన్ని పార్టీల నేతలు సపోర్ట్ చేశారు.
Similar News
News February 15, 2026
మదనపల్లెకు టమాటాలు రావడం లేదు..!

మదనపల్లె మార్కెట్‌కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు. బయట రాష్ట్రాల్లోనూ పంటలు పడటం, రేట్లు తక్కువగా ఉండటంతో వ్యాపారులు అక్కడే కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం 35వేల కిలోల టమాటా మాత్రమే వచ్చింది. 10కిలోల మొదటి రకం రూ.190, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160తో అమ్ముడుపోయాయి.
News February 15, 2026
రైతుభరోసా ఒకే విడతలో.. ?

TG: గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి పెట్టుబడికి రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒకే విడతలో ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17న రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
News February 15, 2026
కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్‌లో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1, 13, 34, 42, 48వ డివిజన్ల కార్పొరేటర్లు సుగుణ, తలుగు శాంత, విజయలక్ష్మి, మణి, నరేష్ ఉన్నారు.


