News January 7, 2026

‘బాపట్ల జిల్లా టాప్-3లో ఉండాలి’

image

రెవెన్యూ, హెల్త్, అగ్రికల్చర్ నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా టాప్-3లో ఉండేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలో పలు అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సమస్యల అర్జీల శాతం తగ్గించాలన్నారు. రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలన్నారు.

Similar News

News February 9, 2026

డ్రైవర్ నిర్లక్ష్యం.. 30 మంది మృతి

image

నైజీరియాలోని కానోలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 30 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ దేశంలో రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

News February 9, 2026

KMR: సిట్టింగ్‌లు సీట్లు పదిలపరుచుకోనున్నారా! లేక?

image

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో గతంలో పోటీ చేసి గెలుపొందిన వ్యక్తులు ప్రస్తుతం ఆయా వార్డుల్లో మళ్లీ పోటీలో ఉన్నారు. కొందరు అదే వార్డులో పోటీచేస్తుండగా, మరికొందరు రిజర్వేషన్లు అనుకూలించక పక్క వార్డుల్లో పోటీ చేస్తున్నారు. గతంలో గెలిచిన కౌన్సిలర్లు ఒక పార్టీ నుంచి పోటీచేయగా, ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి బరిలో నిలిచారు. మరి ఈ పుర సమరంలో గెలుపెవరిది! ఓటమి ఎవరిదో? చూడాలి మరి..!

News February 9, 2026

KMR: నేటితో ప్రచార పర్వం ముగింపు

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేటితో తెరపడనుంది. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు తీయనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించగా సోమవారం సాయంత్రం 5గం.లకు ప్రచార రథాల మైకులు బంద్ కానున్నాయి.