News January 7, 2026
నిజామాబాద్ జిల్లా జైలర్ సస్పెండ్

నిజామాబాద్ జిల్లా జైలర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల సారంగాపూర్ జిల్లా జైలులో గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ, డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలర్ పూర్ణచందర్‌కు నిజామాబాద్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
Similar News
News February 5, 2026
జగిత్యాల: కాంగ్రెస్‌లో వర్గపోరు ముదురుతుందా?

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్‌కు రానున్న రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పక్కన పెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా పత్రికా ప్రకటనల్లో జీవన్ రెడ్డి ఫోటో కనిపించకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో కొనసాగుతున్న విభేదాలు, మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపే దీనికి కారణమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
News February 5, 2026
BREAKING: పాలమూరు యూనివర్సిటీ ఫలితాల విడుదల

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గత సంవత్సరం నవంబర్‌లో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.palamuruuniversity.comలో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.
> SHARE IT.
News February 5, 2026
ఖాకీలో కర్తవ్యం.. హృదయంలో సేవాభావం

★ చదివిన బడికి నెల జీతం విరాళం
ATP: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఖాసీం సాబ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆయన, తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఒక నెల జీతం రూ.45 వేలను విరాళంగా అందజేశారు. సొంత ఊరిపై మమకారంతో ఆయన చేసిన ఈ సాయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.


