News April 25, 2024

కర్ణాటకలో ముస్లింలూ ఓబీసీలే: NCBC

image

కర్ణాటకలో ముస్లింలు బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌లలో భాగం కావడాన్ని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ (NCBC) తప్పుపట్టింది. ‘ముస్లింలు ఓబీసీ పరిధిలోకి వస్తారని కర్ణాటక ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 17 ముస్లిం వర్గాలు కేటగిరీ-1, మరో 19 ముస్లిం వర్గాలు కేటగిరీ-2A పరిధిలోకి వస్తాయి. ముస్లిం వర్గాల్లో నిరుపేదలు ఉన్నా ఆ మతం మొత్తాన్ని వెనుకబడిన వర్గంగా పరిగణించడం సరికాదు’ అని పేర్కొంది.

Similar News

News March 18, 2026

2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

image

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించినట్లు మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.

News March 18, 2026

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.