News January 7, 2026

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? క్లారిటీ

image

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. బీరు తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కిడ్నీలు ఒత్తిడికి గురై రాళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. బీరులోని ప్యూరిన్‌తో యూరిక్ యాసిడ్ పెరిగి కొత్త రాళ్లు ఏర్పడవచ్చు. మూత్రంలో ప్రెజర్ పెరిగి రాయి బ్లాడర్‌లో ఇరుక్కునే ప్రమాదం ఉంది.

Similar News

News February 20, 2026

ఇతరుల చేతి నుంచి తీసుకోకూడని వస్తువులు ఇవే..

image

నూనె, ఉప్పు, గుడ్లు.. ఇతరులు ఇస్తున్నప్పుడు వీటిని నేరుగా చేతితో తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తికి ఓ ప్రత్యేక శక్తి ఉంటుంది. వస్తు మార్పిడితో ఆ శక్తి బదిలీ అయ్యే అవకాశాలుంటాయి. అలా.. వీటిని తీసుకుంటే వారి నెగటివ్ ఎనర్జీ కూడా రావొచ్చు. తద్వారా వారి కష్టాలు, దోషాలు సైతం అంటుతాయని నమ్మకం. వీటిని కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.

News February 20, 2026

భారత పర్యటనకు షకీరా

image

గ్లోబల్ పాప్ ఐకాన్, గ్రామీ అవార్డ్ విన్నర్ షకీరా ఇండియా పర్యటనకు రానున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘ఫీడింగ్ ఇండియా’ నిర్వహించే కాన్సర్ట్‌లలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఏప్రిల్ 10, 15 తేదీల్లో ముంబై, ఢిల్లీలో ఈవెంట్స్ జరగనున్నాయి. దీనిద్వారా వచ్చే డబ్బులను పోషకాహార లోపంతో బాధపడే పిల్లల కోసం వెచ్చించనున్నారు. షకీరా చివరిసారిగా 2007లో ముంబైకి వచ్చారు.

News February 20, 2026

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో జూనియర్ ఆఫీసర్/బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీతో పాటు పనిఅనుభవం గలవారు నేటి నుంచి మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాది రూ.7.56లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: recruit.southindianbank.bank.in