News January 7, 2026

రాత పరీక్షల నిర్వహణపై కోనసీమ జిల్లా జేసీ సమీక్ష

image

అమలాపురం మండలంలోని బట్లపాలెం ఇంజినీరింగ్ కళాశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరులోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఈనెల 8న ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్ బేస్డ్ డిపార్ట్మెంటల్ రాత పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా జేసీ నిశాంతి సూచించారు. బుధశారం ఆమె అమలాపురంలో అధికారులతో కలెక్టరేట్ వద్ద సమీక్షించి పలు సూచనలు చేశారు.

Similar News

News January 12, 2026

వారాన్ని బట్టి పందెం పుంజులను బరిలో దింపుతారు

image

కుక్కుట శాస్త్రం ప్రకారం నక్షత్రాలను బట్టి అనుకూల రంగులున్న కోళ్లను బరిలోకి దింపుతారట. పందెం కట్టేవాళ్లు ఇంటికి బరి ఏ దిక్కున ఉందో చూసుకోవడంతో పాటు పేరులో తొలి అక్షరాన్ని బట్టి దిక్కును నిర్ణయించుకుంటారట. ఆది, శుక్రవారం అయితే ఉత్తర దిశ నుంచి.. సోమ, శనివారం అయితే దక్షిణ దిశ నుంచి.. మంగళవారం తూర్పు దిశ నుంచి బుధవారం, గురువారం పడమర దిశ నుంచి కోళ్లను బరిలోకి దింపుతారట. వారాన్ని బట్టి ఈ దిశ మారుతుంది.

News January 12, 2026

పినపాక: జాతీయ కబడ్డీ విజేత రాజస్థాన్‌

image

పినపాక మండలం ఈ-బయ్యారంలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్‌-17 SGF బాలుర కబడ్డీ సమరం ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో గెలుపొంది విన్నర్‌గా నిలిచిన రాజస్థాన్‌ జట్టుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ట్రోఫీని అందజేశారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జాతీయ క్రీడలు విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.

News January 12, 2026

గోదావరి జిల్లాల్లో కోడి పందేలు అలా మొదలయ్యాయి అండి.. ఆయ్!

image

గోదావరి జిల్లాల కోడిపందేలకు శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. పలనాటి యుద్ధంలో వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకలుగా నిలిచిన ఈ పందేలను మన గోదావరి జిల్లాలు ఆదరించాయి. రాజులు, సైనికుల్లో యుద్ధకాంక్షను, ఉత్తేజాన్ని నింపేందుకు ప్రారంభమైన ఈ క్రీడ, కాలక్రమేణా మన జిల్లా సంక్రాంతి సంబరాల్లో విడదీయలేని అంతర్భాగమైంది. ఉభయ గోదావరి ప్రాంత ఆభిజాత్యానికి, సంస్కృతికి అద్దం పడుతూ ప్రత్యేక గుర్తింపును పొందాయి.