News January 7, 2026
వేములవాడ బద్ది పోచమ్మ ఆలయం వద్ద క్యూలైన్ల ఏర్పాటు

వేములవాడ బద్ది పోచమ్మ ఆలయం వద్ద క్యూలైన్లను తిరిగి ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఉన్న క్యూలైన్ల అడుగు భాగంలో కొత్తగా సీసీ ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు. ఈ పనుల కోసం ఆ ప్రాంతంలో క్యూ లైన్‌లను తాత్కాలికంగా తొలగించారు. సీసీ ఫ్లోరింగ్ పనులు పూర్తి కావడంతో ఆలయ అధికారులు క్యూ లైన్‌లను తిరిగి ఏర్పాటు చేసి పందిళ్లు వేశారు. మరోవైపు బద్ది పోచమ్మ వీధి ప్రాంతంలో కొత్తగా చలువ పందిల్లు వేస్తున్నారు.
Similar News
News January 13, 2026
నాగర్‌కర్నూలు: ఐదుగురు ఏఈఓల సస్పెన్షన్

పాలెం వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఐదుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) సస్పెన్షన్‌కు గురయ్యారు. లీకైన పత్రాల ద్వారా పరీక్షలు రాసి పాసైనట్లు గుర్తించిన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు చర్యలు తీసుకుంది. సస్పెండైన వారంతా పాలెం కళాశాల పూర్వ విద్యార్థులే. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2026
రిపబ్లిక్ డే.. దీపికకు ప్రెసిడెంట్ ఇన్విటేషన్

భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్, ఏపీకి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర వేడుకలకు రావాలంటూ ఆమెకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆహ్వానం పంపారు. శ్రీసత్యసాయి జిల్లాలోని తంబాలహట్టికి వెళ్లిన అధికారులు దీపికకు ఇన్విటేషన్ అందజేశారు. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల అంధుల జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో దీపికపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
News January 13, 2026
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల

రఘునాథపాలెం మండలం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే రోజున శంకుస్థాపన చేసి, నేడు నీళ్లిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. మంచుకొండ లిఫ్ట్‌తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.


