News January 7, 2026
VJA: లోకల్‌కే పెద్దపీట.. సంక్రాంతికి 6వేల RTC సర్వీసులు.!

సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని RTC కీలక నిర్ణయం తీసుకుంది. 8,432 ప్రత్యేక సర్వీసుల్లో 6వేల బస్సులను రాష్ట్రంలోని లోకల్ రూట్లలోనే నడపనుంది. ‘స్త్రీశక్తి’ పథకంతో పెరిగిన రద్దీ దృష్ట్యా స్థానిక ప్రాంతాలకు పెద్దపీట వేసింది. HYD, బెంగళూరు, చెన్నైల నుంచి వందలాది బస్సులు నడుపుతున్నా, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల ద్వారా గ్రామీణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారు.
Similar News
News January 14, 2026
CTR: భారీగా పడిపోయిన టమాటా ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ బుధవారం గరిష్ఠంగా రూ.194, కనిష్ఠంగా రూ.140 పలికింది. పలమనేరులో గరిష్ఠ ధర రూ.220, కనిష్ఠ ధర రూ.170, వి.కోటలో గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.140, ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.230, కనిష్ఠ ధర రూ.120గా నమోదైంది.
News January 14, 2026
‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
News January 14, 2026
‘ట్రంప్ ఎలా బతికున్నారో ఏంటో’.. ఆరోగ్యశాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్ జంక్ ఫుడ్ అలవాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ కెన్నడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరం మెక్‌డొనాల్డ్స్ ఫుడ్, క్యాండీలు తింటూ డైట్ కోక్ తాగుతారని తెలిపారు. రోజంతా శరీరంలోకి విషాన్ని పంపిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. ‘ఆయన ఇంకా ఎలా బతికున్నారో అర్థం కావడం లేదు’ అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ప్రయాణాల్లో కార్పొరేట్ కంపెనీల ఫుడ్‌నే నమ్ముతారని.. ఆయనకు దైవ సమానమైన శరీరతత్వం ఉందని చమత్కరించారు.


