News January 7, 2026

ఉగ్ర దోస్తీ.. పాక్‌లో చేతులు కలిపిన హమాస్, లష్కరే!

image

పాక్ అడ్డాగా అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్ ముమ్మరమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా హమాస్ కమాండర్ నాజీ జహీర్, లష్కరే తోయిబా కీలక నేత రషీద్ అలీ సంధూతో గుజ్రాన్‌వాలాలో కలవడం సంచలనం సృష్టిస్తోంది. గతంలోనూ జహీర్ PoKలో పర్యటించి భారత వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొన్నాడు. అమెరికా నిషేధించిన ఈ రెండు గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి పాక్ సైన్యం అండ ఉన్నట్లు సమాచారం.

Similar News

News February 21, 2026

హోలీ కోసం ఇంట్లోనే సహజ రంగులు

image

* పింక్ కలర్ కోసం బీట్‌రూట్‌లను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ద్రావణాన్ని వడకట్టి వాడొచ్చు. * ఎరుపు రంగు కోసం గులాబీ రేకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. తర్వాత ఎండలో పెట్టండి. ఎండబెట్టిన ఎరుపు మందార పువ్వులను పొడిగా చేసి, అందులో కొద్దిగా బియ్యప్పిండి కలిపితే ఎరుపు రంగు వస్తుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్‌గా వాడొచ్చు.

News February 21, 2026

70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: https://gailonline.com

News February 21, 2026

ABVP Vs SFI: ఏయూలో మరోసారి హైటెన్షన్

image

AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వద్ద <<19173653>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన SFI, AISF కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ మెయిన్ గేటు వద్ద ABVP ఆందోళనకు దిగింది. దీంతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. AUలో రెండు రోజుల క్రితం RSS మార్చ్‌ను SFI అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. SFI-ABVP మధ్య ఘర్షణ జరిగింది.