News April 25, 2024

స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నిర్మల్ జిల్లా విద్యార్థి

image

కుబీర్ మండలం సిరిపల్లి తండాకు చెందిన రాథోడ్ అంజలి నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. నిర్మల్‌లోని టీఎస్ఆర్‌జేసీ‌లో ఇంటర్ చదువుతున్న అంజలి బైపీసీ గ్రూపులో 440 మార్కుల గాను 437 మార్కులు సాధించింది. దీంతో ఆమెను కుటుంబీకులు, గ్రామ సర్పంచ్ అశ్విని పండిత్ జాధవ్, గోపీచంద్ జాధవ్‌తో పాటు పలువురు అభినందించారు.

Similar News

News January 23, 2026

అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించిన ఆయన, విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందాల్సిన పరిహారాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News January 22, 2026

ADB: ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు

image

ప్రత్యేకంగా ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేయాలనే ఉద్దేశంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 5 మండలాల యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ మేళా ప్రారంభించారు. ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయంలో పలువురికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నార్నూర్, గాదిగూడ, సిరికొండ, బజార్హత్నుర్, భీంపూర్ మండలాల్లోని 400 మంది యువకులకు మొదటి విడతలో భాగంగా లర్నింగ్ లైసెన్స్ అందజేశారు.

News January 22, 2026

ఇంద్రవెల్లి: ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కృషి

image

గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, ఆర్‌ఓఎఫ్ఆర్ పట్టాల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందని పీవో యువరాజ్ తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యా, వైద్యం, రవాణా సౌకర్యం వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆదివాసీల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని, తండాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.