News January 7, 2026

వరంగల్‌లో పోలీసులు Vs ఎమ్మెల్యే

image

భీమారం పోలీస్ క్యాంపు స్థలం విషయంలో మంత్రి సాక్షిగా వరంగల్ పోలీసులకు, పశ్చిమ MLA నాయిని మధ్య వాగ్వాదం జరుగుతోంది. క్యాంపు స్థలాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు ఇవ్వాలని MLA పట్టుబడుతుండగా, ఆ స్థలాన్ని పోలీసులకు అప్పగించాలని CP కోరుతున్నారు. ఇరువురిని మంత్రి పొంగులేటి పిలిచి మాట్లాడారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Similar News

News February 3, 2026

నెల్లూరు: పసికందును వదిలి వెళ్లిపోయారు

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 3 నెలల క్రితం మగబిడ్డను వదిలి వెళ్లారు. బరువు తక్కువగా ఉన్న మగ శిశువును చిన్నపిల్లల వైద్యులే అన్నితామై సంరక్షించారు. వదిలి వెళ్లినవారు రాకపోవడంతో వారిని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచార జీవనం గడుపుతున్న రేణుక గతేడాది అక్టోబర్‌లో అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా శిశువు బరువు తక్కువగా ఉందని తన భర్తతో వచ్చి ఆసుపత్రిలో చేరారని తెలిపారు.

News February 3, 2026

అనకాపల్లి: రికార్డు స్థాయిలో బెల్లం అమ్మకాలు

image

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో సోమవారం రికార్డు స్థాయిలో బెల్లం అమ్మకాలు జరిగాయి. రైతులు 13,005 బెల్లం దిమ్మలను తీసుకువచ్చి విక్రయించారు. మొదటి రకం బెల్లం 100 కిలోలు రూ.4,170,రెండవ రకం రూ.4,020,మూడవ రకం 3,540 ధర పలికింది. ఇక్కడి నుంచి బెల్లం ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఏపీలో వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.

News February 3, 2026

తిరుపతి: తుంబూరు అడవిలో చిరుత సంచారం?

image

నారాయణవనం మండలం తుంబూరు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచరించినట్లు‌ మునిరాజ అనే స్థానికుడు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తన మేకపిల్లను నోటకరిచి ఎత్తుకెళ్లిందన్నారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అటవీ ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అయితే అది చిరుత? లేక అడవి జంతువా? అని తెలియలేదన్నారు.