News January 7, 2026
సిరిసిల్ల: ‘పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.ఐదు కోట్ల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 2, 2026
వనపర్తి: గుర్తుల కేటాయింపుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి: కలెక్టర్

మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలనే అభ్యర్థులు స్వయంగా వచ్చి ఉపసంహరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలాకాకుండా ప్రతిపాదిత వ్యక్తి, ఏజెంట్ ఉపసంహరణ పత్రం సమర్పిస్తే అధికారులు తప్పనిసరిగా అభ్యర్థికి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలన్నారు.
News February 2, 2026
ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం తగదు: జనగామ కలెక్టర్

ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్డీవో వసంత, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఉపాధి హామీ పనులపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పేదలకు ఉపాధి కల్పించడమే పథకం ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఏపీడీ నూరొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
News February 2, 2026
వనపర్తి: చుక్కల్లో బంగారం.. ఆకాశంలో వెండి ధరలు!

వనపర్తిలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నేడు మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,58,000 పలుకుతుండగా, తులం ధర రూ.1,84,300 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా అదే స్థాయిలో 10 గ్రాములకు రూ.2,750, తులం రూ.3,208 పలుకుతోంది. ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


