News January 7, 2026
దొంగలపై 181 కేసులు.. చిత్తూరులో చిక్కారు.!

చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన <<18789584>>దొంగల<<>> వివరాలు.. గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య (49), పల్నాడు జిల్లా నారాయణపురానికి చెందిన నాగుల్ మీరా(27), గుంటూరు జిల్లా సంగడి గుంటకు చెందిన తులసి రామిరెడ్డి (27)ని పోలీసులు అరెస్టు చేశారు. వెంకయ్యపై 100 కేసులు, నాగుల్ మీరాపై 75 కేసులు, తులసి రామిరెడ్డి పై ఆరు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
Similar News
News January 12, 2026
చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.
News January 12, 2026
చిత్తూరులో ఘనంగా వివేకానంద జయంతి

చిత్తూరులోని వివేకానంద పార్కులో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే తండ్రి చెన్నకేశవుల నాయుడు హాజరయ్యారు. ఆయన పలువురికి హిందూ సమ్మేళన పురస్కారాలను పంపిణీ చేశారు. వివేకానందుడు చూపిన మార్గం యువతకు ఆదర్శనీయమని కొనియాడారు.
News January 12, 2026
చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్‌ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరుకు బదిలీ అయ్యారు. చిత్తూరులో JC విద్యాధరి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.


