News January 7, 2026

సిరిసిల్ల: ‘యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు’

image

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. జిల్లాలో యూరియాకు కొరత లేదని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామన్నారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో యూరియా కొరత ఉన్నట్లు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు.

Similar News

News February 12, 2026

కంది ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ

image

సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ పలు ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ అసోసియేట్, అటెండెంట్ విభాగాల్లో మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 13వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News February 12, 2026

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) 3 జాయింట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతతో పాటు 15ఏళ్ల అనుభవం గలవారు మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 65ఏళ్లు. నెలకు రూ.1,75,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nhai.gov.in/

News February 12, 2026

HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

image

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.