News January 7, 2026

జగిత్యాల: ‘ఓటర్ల జాబితా నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి’

image

ఓటర్ల జాబితా నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం మ్యాపింగ్, ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. కాన్ఫరెన్స్లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్ తదితరులున్నారు.

Similar News

News February 16, 2026

పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు

image

వివాహానికి ముందు యువతీయువకులు శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పెళ్లి హామీతో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది. ‘మేం పాత తరం వాళ్లం. ఇప్పటి తరం పెళ్లికి ముందు ఎందుకు ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తోందో అర్థం చేసుకోలేకపోతున్నాం’ అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ పేర్కొన్నారు.

News February 16, 2026

ఈ నెల 18న విశాఖకు ముఖ్యమంత్రి రాక

image

విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 18న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్ జెట్టికి చేరుకొని భారత రాష్ట్రపతికి స్వాగత కార్యక్రమం అనంతరం ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గం.1:20 నిమిషాలకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయలుదేరి ఉండవల్లి వెళ్తారు.

News February 16, 2026

NRPT: ఏపీకే ఫైల్స్, తెలియని వెబ్‌సైట్లతో జాగ్రత్త: SP

image

స్మార్ట్ ఫోన్లకు వచ్చే ఏపీకే ఫైల్స్, తెలియని వెబ్‌సైట్, అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రజలను హెచ్చరించారు. పెరిగిన అధునాతన టెక్నాలజీ వాడుతూ సైబర్ నేరగాళ్లు నూతన పద్ధతులను అనుసరించి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే స్థానిక పోలీసులను లేదా 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు.