News January 7, 2026
రేపు అంతరిక్షంలోకి నాసా వ్యోమగాములు

ఈ ఏడాది తొలి స్పేస్ వాక్ కోసం ISS బృందం సిద్ధమైంది. నాసా వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్‌మ్యాన్ రేపు సాయంత్రం 6.30 గంటలకు అంతరిక్ష కేంద్రం వెలుపలికి రానున్నారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగే ఈ ప్రక్రియలో వారు కొత్త సోలార్ ప్యానెల్స్ అమరికకు అవసరమైన కిట్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. అలాగే అంతరిక్షంలో సూక్ష్మజీవుల నమూనాలను సేకరించడం వంటి పనులు చేస్తారు.
Similar News
News February 22, 2026
బుమ్రా, వరుణ్ సూపర్ రికార్డు

T20WC సూపర్-8లో SAతో మ్యాచ్‌లో బుమ్రా, వరుణ్ అరుదైన ఘనత సాధించారు. T20WCలో IND తరఫున అత్యధిక వికెట్లు(33) తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అర్ష్‌దీప్(32), అశ్విన్(32), హార్దిక్(29), జడేజా(22) ఉన్నారు. అలాగే IND తరఫున టీ20ల్లో వరుసగా అత్యధిక ఇన్నింగ్స్(18)లలో కనీసం ఒక వికెట్ తీసిన బౌలర్‌గా వరుణ్ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో అర్ష్‌దీప్(17), నెహ్రా(13), సుందర్(11) ఉన్నారు.
News February 22, 2026
తమిళ నటి తండ్రి హత్య

తమిళ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణన్(73) దారుణ హత్యకు గురయ్యారు. తమిళనాడులోని దిండిగల్(D)లో ఆయనకు ఓ గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ అద్దెకు చేరిన ఐదుగురు యువకులు ఆయనను చంపేసి నగదు, నగలు, డాక్యుమెంట్లతో పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా విష్ణుప్రియ తమిళంలో సూర్యతో కలిసి ‘మాయావి’ సినిమాలో నటించారు. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారు.
News February 22, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు 8.30am – ఎల్లుండి 8.30am మధ్య వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, NLG, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, హనుమకొండ, జనగామ, SDPT, యాదాద్రి, భువనగిరి, RR, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


