News January 7, 2026
భారత్ ఘన విజయం

సౌతాఫ్రికాతో జరిగిన యూత్ మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 393/7 రన్స్ చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (118), వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీలతో చెలరేగారు. అనంతరం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160కే కుప్పకూలింది. టాప్-4 ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో 233 పరుగుల భారీ తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
Similar News
News January 21, 2026
WPL: ఇక థ్రిల్లింగ్ మ్యాచులేనా?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL-2026) ఈసారి థ్రిల్లింగ్‌గా మారింది. ఇప్పటికే RCB ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా మిగతా 2 జట్లు తేలాల్సి ఉంది. MI, యూపీ, గుజరాత్, ఢిల్లీ నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై మిగతా 2 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే పోటీలో ఉంటుంది. అటు గుజరాత్, ఢిల్లీ, UP తొలిసారి ట్రోఫీని అందుకునే అవకాశాన్ని నిలుపుకోవాలంటే మిగతా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే.
News January 21, 2026
రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ <
News January 21, 2026
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మళ్లీ పడతాయా?

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 25,185 వద్ద, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 82,025 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో ICICI బ్యాంక్, BE, ట్రెంట్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాలో ట్రేడవుతున్నాయి. నిన్న ₹9 లక్షల కోట్లకు పైగా మార్కెట్లు <<18907026>>నష్టపోవడం<<>> తెలిసిందే.


