News January 7, 2026
3 రోజుల్లో అన్నమయ్య జిల్లాలో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News February 4, 2026
జనసేన పార్టీకి ఉత్తరాంధ్ర కీలక నేత రాజీనామా

జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నట్లు బోలిశెట్టి సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర కాలుష్య సమస్యలపై 2020లో హైకోర్టులో పిల్ వేశానని, ఈ కేసులో నైతిక ఇబ్బందులు కలగకూడదని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖలో ఉన్న కారణంగా రాజకీయ పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో తాను పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.
News February 4, 2026
TPT: పోస్టాఫీసులో ఉద్యోగాలు.. APPLY చేసుకోండి.!

తిరుపతి డివిజనల్ పోస్టాఫీస్ పరిధిలో 28 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏబీపీఎం, బీపీఎం, డాక్ సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. https://www.indiapost.gov.in/ లో ఈనెల 16 లోపు దరఖాస్తు చేయాలన్నారు. 18 నుంచి 40 సంవత్సరాలలోపు, పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నారు.
News February 4, 2026
CSK అభిమానులకు గుడ్‌న్యూస్

IPLలో అత్యంత విజయవంతమైన CSK ఫ్రాంచైజీ త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ CEO కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ఇది భవిష్యత్తు ప్రణాళికలో భాగమని, మహిళల క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత WPL 2026 సీజన్ ముగింపు దశకు వచ్చింది. రేపు వడోదరలో జరిగే ఫైనల్‌లో ఢిల్లీ టీమ్ RCBతో తలపడనుంది. ప్రస్తుతం WPLలో 5 జట్లు పాల్గొంటున్నాయి.


