News January 7, 2026

కోరుట్ల: వెంకటేశ్వర స్వామికి 108 రకాల నైవేద్యాలు

image

కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు అభిషేకం తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 31, 2026

నల్గొండ: పెట్రోల్ దాడిలో గాయపడ్డ బాలుడి మృతి

image

నాంపల్లి మండలం కేతేపల్లిలో జరిగిన <<19012188>>పెట్రోల్ దాడి<<>>లో ఐదు నెలల బాలుడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో నరేశ్ భార్య మమతపై సుజాత నిప్పంటించగా ఆమె మృతిచెందింది. ఇప్పుడు పసికందు కూడా మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ అమానుషానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News January 31, 2026

విశాఖ: మహిళకి ప్లాస్టిక్ సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లు

image

KGH వైద్యులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన R.సాయమ్మ (46) అనే మహిళకు సంక్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు. బొబ్బలి సమీపంలో జరిగిన ప్రమాదంలో సాయమ్మ గాయపడి KGHలో చేరారు. ఆమె దవడ, కంటి చుట్టూ ఎముకలు విరగగా, ప్లాస్టిక్ సర్జరీ, కంటి వైద్య నిపుణులు సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లను సూపరింటెండెంట్ డా.ఐ. వాణి అభినందించారు.

News January 31, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగవంతంగా, సులభంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన రెవెన్యూ క్లినిక్, సేవా కౌంటర్లను కలెక్టర్ జి.రాజకుమారి శనివారం ప్రారంభించారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన షెడ్లను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.