News January 8, 2026
SRCL:బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆయా శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని రాజన్న సిరిసిల్లజిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ – 2026 సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Similar News
News February 3, 2026
నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూచాడి శ్రీహరి రావు ప్రకటించారు. పార్టీ నిర్ణయం మేరకు మొత్తం 42 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేశారు. 1వ వార్డు కత్తి నరేందర్ నుంచి 42వ వార్డు వరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలతో కూడిన పూర్తి లిస్ట్ ఇదే. అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News February 3, 2026
బద్వేల్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

బద్వేల్ రైస్ మిల్లుల్లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల్లోని నిల్వలను, రికార్డులను పరిశీలించారు. మార్కెట్ సెస్ చెల్లించని సరుకును గుర్తించారు. వాటి విలువను లెక్కించారు. మిల్లుల యజమానుల నుంచి రూ.10,69,528లు వ్యవసాయ మార్కెట్ సెస్సు వసూలు చేశారు. జేడీఎం రామాంజనేయులు ఆదేశాల మేరకు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
News February 3, 2026
మామిడి రైతులను ఆదుకోవాలని వినతి

గత సీజన్‌లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి కోరారు. మామిడి రైతులకు 50% రాయితీతో ఎరువులు, పురుగు మందులు అందేలా చూడాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందించినట్లు ఆయన చెప్పారు. మామిడి కవర్లను సబ్సిడీ ధరతో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.


