News January 8, 2026
తంగళ్ళపల్లి: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్‌లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాపూర్‌కు చెందిన సుధగోని పర్ష రాములు (48) గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతూ కుంగిపోయాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News February 3, 2026
బద్వేల్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

బద్వేల్ రైస్ మిల్లుల్లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల్లోని నిల్వలను, రికార్డులను పరిశీలించారు. మార్కెట్ సెస్ చెల్లించని సరుకును గుర్తించారు. వాటి విలువను లెక్కించారు. మిల్లుల యజమానుల నుంచి రూ.10,69,528లు వ్యవసాయ మార్కెట్ సెస్సు వసూలు చేశారు. జేడీఎం రామాంజనేయులు ఆదేశాల మేరకు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
News February 3, 2026
మామిడి రైతులను ఆదుకోవాలని వినతి

గత సీజన్‌లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి కోరారు. మామిడి రైతులకు 50% రాయితీతో ఎరువులు, పురుగు మందులు అందేలా చూడాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందించినట్లు ఆయన చెప్పారు. మామిడి కవర్లను సబ్సిడీ ధరతో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
News February 3, 2026
నిర్మల్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్.. ప్రచారానికి గ్రీన్ సిగ్నల్!

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితాతో స్థానిక రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పార్టీ అధిష్ఠానం కీలక వార్డుల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. జాబితా వెలువడిన వెంటనే టికెట్ దక్కిన వారిలో ఉత్సాహం వెల్లివిరిసింది. కాంగ్రెస్ శ్రేణులు ఇక నుంచి ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నారు.


