News January 8, 2026

కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

image

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.

Similar News

News February 8, 2026

KNR: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక కేంద్రాలపై వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. అల్లరి మూకలను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు భయం లేకుండా ఓటు వేయాలని సూచించారు.

News February 8, 2026

KNR: మున్సిపల్ ఎన్నికలు.. ఫేక్ సర్వేలు!

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో అభ్యర్థులు ఫేక్ సర్వేలకు తెరలేపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తమ పార్టీ గెలుస్తుందంటూ నకిలీ సర్వే ఫలితాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ సర్వేలను, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వీటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేకపోవడంతో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

News February 8, 2026

KNR: ముగింపు దశకు పుర పోరు.. హోరెత్తుతున్న ప్రచారం!

image

ఉమ్మడి KNRజిల్లాలోని మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. సోమవారం సా.5గంటలకు ప్రచారం ముగియనుండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర స్థాయి అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యల కంటే ఎక్కువగా రాజకీయ విమర్శలు,ప్రతివిమర్శలతో హాట్ హాట్ గా మారింది.