News January 8, 2026
HYD: CP సజ్జనార్ మాస్ వార్నింగ్!

నగరంలో కల్తీ మాఫియా ఆటకట్టించేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నడుం బిగించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ‘హత్యాయత్నం’ కేసులు పెడతామని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆహార భద్రతా అధికారులతో నిర్వహించిన భేటీలో తనిఖీల కోసం ప్రత్యేక SOPని ప్రకటించారు. కల్తీ సమాచారం ఇచ్చేందుకు త్వరలోనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ రానుంది. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని CP స్పష్టం చేశారు.
Similar News
News January 26, 2026
HYD: బులెట్ దిగినా.. హెడ్ కానిస్టేబుల్ తగ్గేదేలే!

గచ్చిబౌలిలో ప్రిజం పబ్ వద్ద నిందితుడు ప్రభాకర్‌ను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డి సాహసం చేశారు. నిందితుడి కాల్పుల్లో కాలికి గాయమైనప్పటికీ, తగ్గకుండా ప్రాణాలకు తెగించి అతడిని బంధించారు. ఈ అసాధారణ ధైర్యసాహసానికి వెంకటరెడ్డికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డును ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
News January 26, 2026
HYD: బండ్లపై ఈ స్టిక్కర్లు వేసుకోవద్దు!

వాహనాలపై అనధికారికంగా ప్రెస్, అడ్వకేట్, ప్రభుత్వ చిహ్నాలు, HRC స్టిక్కర్లు వాడటంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. సమాచార పౌర సంబంధాల శాఖ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే ‘PRESS’అని రాసుకోవాలని, అదీ నంబర్ ప్లేట్లపై ఉండకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది.
News January 26, 2026
HYD: భూములు వదులుకునేవారికి ‘భారీ నజరానా’..!

నగరంలోని చెరువులు, నాలాల పరిరక్షణకు ప్రభుత్వం సరికొత్త TDR పాలసీని తీసుకొచ్చింది. ఇకపై నాలా వెడల్పు కోసం ప్రైవేటు భూములిస్తే రోడ్డు విస్తరణతో సమానంగా 400% TDR ఇస్తారు. అలాగే చెరువుల బఫర్ జోన్లలో స్థలాలు వదులుకునేవారికి 300% TDR లభిస్తుంది. ఒకవేళ ఆ స్థలం చెరువు అభివృద్ధి పనులకు అవసరమైతే ఏకంగా 400% వరకు బెనిఫిట్స్ కల్పిస్తారు. సెట్‌బ్యాక్ నిబంధనల్లో కూడా సడలింపులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.


