News January 8, 2026
జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడా కారులు

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి హనీత్ నాగ్, శరన్ హేమంత్, సురేఖ ఊసల ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కార్యదర్శి విజయ్ గోగులముడి తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి బయలుదేరిన క్రీడాకారులను పలువురు సీనియర్లు అభినందించి, విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News February 18, 2026
బ్యాటరీ రెంటల్ కార్లు.. ఏంటీ విధానం?

ఈ విధానంలో కస్టమర్ కేవలం కారే కొనుగోలు చేస్తాడు. బ్యాటరీ కాదు. బ్యాటరీని షోరూమ్ రెంట్‌కి ఇస్తుంది. నెలకు మినిమం అమౌంట్ డిపాజిట్ చేసుకుంటుంది. ఆపై ఎన్ని కి.మీ ఎక్కువ తిరిగితే దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తుంది. కారు కొనుగోలు సమయంలో కస్టమర్‌పై అధిక భారం పడొద్దనే కంపెనీలు బ్యాటరీ రెంటల్ విధానాన్ని తీసుకొచ్చాయి. మార్కెట్లో ఇప్పటికే MG విండ్సర్ ఇలాగే రన్ అవుతుండగా తాజాగా మారుతీ <<19171974>>ఈ-విటారా<<>> వచ్చింది.
News February 18, 2026
కర్నూలు: 14 మంది విద్యార్థుల డిబార్

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 14 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు ఉపకులపతి వెంకట బసవరావు తెలిపారు. వీరంతా మంగళవారం జరిగిన పరీక్షలో చూచిరాతకు పాల్పడ్డారని చెప్పారు. KDC, సెయింట్ జోసఫ్, STBC, రావుస్, GDC నంద్యాల, జ్యోతిర్మయి, శ్రీ వేంకటేశ్వర, సిద్ధార్థ, నందరాం, ఆలూరు, సాయిరాం, తదితర కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు డిబార్ అయ్యారు.
News February 18, 2026
IFR-ఎప్పుడు ఎక్కడ జరిగింది?

✦2001 ముంబయి: భారత్‌లో తొలి ఐఎఫ్ఆర్ నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ సమీక్షించారు.
✦2016 విశాఖ: రెండోసారి విశాఖలో జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు.
✦2026 విశాఖ: తాజా ఐఎఫ్ఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించనున్నారు.
✦సుమారు 71 దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయి.
✦ఫిబ్రవరి 19న ఆర్‌కే బీచ్‌లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రజలకు ప్రత్యేక ఆకర్షణ


