News April 25, 2024

స్టీల్ ప్లాంట్: ఉద్యమ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

image

రక్షణ శాఖ మంత్రి విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోరాట కమిటీ సభ్యులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు వీరు అడ్డు పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News March 14, 2026

విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

image

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

News March 14, 2026

మధురవాడలో కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి

image

మధురవాడ ఆర్టీసీ కాలనీ సాయిప్రియ నివాస్ సమీపంలో స్వతంత్రనగర్‌కు చెందిన కారు డ్రైవర్ కుమ్మరపు రవి (41) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆయన, శుక్రవారం ఉదయం పొదల్లో మృతదేహమై కనిపించారు. వాంబే కాలనీ వద్ద కారు నిలిపి, నడుచుకుంటూ వచ్చి అక్కడ పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రవి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2026

విశాఖ: ‘నేడు పాఠశాలల సెలవు రద్దు’

image

జిల్లాలో మార్చి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈఓ ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో వరుస సెలవులు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా ఈరోజు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.