News April 25, 2024

గుండెపోటుకు గురై ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి

image

గుండెపోటుకు గురై ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. అనంతపురం నార్పల మండలంలోని నాయనపల్లి సమీపంలో తాడిపత్రి -అనంతపురం ప్రధాన రహదారిపై బస్సు ఆపి డ్రైవర్ ఓబుల్ రెడ్డి కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో అనంతపురానికి తరలించగా అక్కడ మృతిచెందాడు. విధుల్లో భాగంగా తాడిపత్రి తాడిపత్రి నుంచి ధర్మవరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 26, 2026

ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

image

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.

News February 26, 2026

అనంత: ఇంటర్ సెకండియర్ పరీక్షలు.. 368 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా జరిగినట్లు ఆర్ఐవో వెంకటరమణ నాయక తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 20,855 గాను 20,517 మంది హాజరవ్వగా.. 338 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,931కి గాను 1,901 మంది హాజరై 30 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.