News April 25, 2024
కోహ్లీ రెస్టారెంట్లో RCB క్రికెటర్ల సందడి

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌లో RCB క్రికెటర్లు సందడి చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘వన్8 కమ్యూన్’ రెస్టారెంట్‌ను సందర్శించి అక్కడి ఫుడ్, డ్రింక్స్‌ను వీరు ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేపు ఉప్పల్‌లో SRHతో RCB తలపడనుంది. ఇప్పటివరకు బెంగళూరు 8 మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్కటి గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
Similar News
News March 12, 2026
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <
News March 12, 2026
దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.
News March 12, 2026
డొమెస్టిక్ సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్

TG: రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. హోటల్ పరిశ్రమకు LPG అవసరాలు తీర్చడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సిలిండర్లు బ్లాక్ చేస్తే ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.


