News April 25, 2024
మేం కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు: రేవంత్

TG: కాంగ్రెస్, BRS కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో ప్రజలు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మేం కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు లేవు. నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మేడిగడ్డ మేడిపండు అయింది. అన్నారం ఆకాశాన్ని అంటింది. సుందిళ్ల సున్నం అయింది. కాళేశ్వరం వెళ్దాం రండి.. కేసీఆర్ కట్టిన అద్భుతమేంటో మేం చూపిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.
Similar News
News December 29, 2025
అదరగొట్టిన హంపి, అర్జున్.. మోదీ, CBN ప్రశంస

FIDE వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసి అదరగొట్టారు. దోహాలో జరిగిన ఈ టోర్నీలో హంపి మహిళల విభాగంలో, అర్జున్ ఓపెన్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఇది భారత్‌కు గర్వకారణమని PM మోదీ పేర్కొన్నారు. వారి పట్టుదల, అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ వేదికపై తెలుగు ఆటగాళ్ల ప్రతిభను చంద్రబాబు ప్రశంసించారు.
News December 29, 2025
సీఎం చంద్రబాబు ఫీల్ అవుతున్నారు: అనగాని

AP: జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడంపై CM చంద్రబాబు కూడా ఫీల్ అవుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కానీ రాయచోటితో ఉండటానికి ఎవరూ కోరుకోవట్లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో CM ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రాతినిధ్య ప్రాంతం ఇలా అవ్వడంపై మంత్రి రామ్‌ప్రసాద్ బాధలోనూ అర్థముందన్నారు. రానున్న రోజుల్లో ఆయన దీన్ని అధిగమించి, సీఎం ఆశీర్వాదంతో రాయచోటిని అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు.
News December 29, 2025
భారత ప్రభుత్వానికి లలిత్ మోదీ క్షమాపణ

పరారీలో ఉన్న IPL ఫౌండర్ లలిత్ మోదీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల విజయ్ మాల్యాతో కలిసి చేసిన <<18679569>>వీడియో<<>>పై తీవ్ర విమర్శలు రావటంతో స్పందించారు. ‘ఎవరి ఫీలింగ్స్‌నైనా గాయపర్చి ఉంటే క్షమించాలి. ముఖ్యంగా భారత ప్రభుత్వం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని Xలో పోస్ట్ చేశారు. వాళ్లను భారత్‌కు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.


