News January 8, 2026
చిత్తూరు: వైసీపీలో పలువురికి పదవులు

జిల్లాకు చెందిన పలువురిని వైసీపీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫక్రుద్దీన్(పుంగనూరు) మైనారిటీ సెల్ జోన్ 5 వర్కింగ్ ప్రెసిడెంట్, రవీంద్రనాథ్ రెడ్డి(చిత్తూరు) రాష్ట్ర లీగల్ జనరల్ సెక్రెటరీ, లీగల్ సెల్ అధికార ప్రతినిధులుగా రవీంద్ర(నగరి) సుగుణ శేఖర్ రెడ్డి(చిత్తూర్), జిల్లా ఉద్యోగులు, పింఛన్ వింగ్ అధ్యక్షుడిగా సోమచంద్రారెడ్డి(పలమనేరు)ను నియమించారు.
Similar News
News February 23, 2026
మామూళ్ల పర్వం.. తూతూ మంత్రంగా తనిఖీలు!

పలమనేరు, GDనెల్లూరు, పూతలపట్టు ప్రాంతాల్లో అక్రమ <<19213845>>మట్టి<<>>, ఇసుక రవాణాపై వరుస కథనాలు వస్తున్నా అధికారులు, అక్రమార్కులు ఏ మాత్రం లెక్క చేయలేదట. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం అక్రమార్కులకు వరంగా మారుతోందట. భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. నగరిలో <<19196766>>శవాలను<<>> సైతం తొలగించి ఇసుకను తవ్వుతున్న ఘటనలు చూశాం. వీటి వెనుక స్థానిక ప్రజా ప్రతినిధులే ఉన్నట్లు తెలుస్తోంది.
News February 23, 2026
నంజంపేట పోస్టుమాస్టర్‌కు మళ్లీ అవార్డ్

సోమల(M) నంజంపేట పోస్టుమాస్టర్ చిదానందంను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ సన్మానించారు. ఆదివారం గుంటూరులో జీడీఎస్ సమ్మేళన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్ సేవకులను సన్మానించారు. వారిలో చిదానందం రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. కాగా ఈయన గతేడాది కూడా ప్రతిభ కనబరచి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు.
News February 23, 2026
చిత్తూరు జిల్లాలో సహకార సంఘం ఉద్యోగుల పోరుబాట

జిల్లాలో సహకార సంఘ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి దశల వారిగా భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో 75 PASCలు ఉండగా.. అందులో 350 మంది విధులు నిర్వహిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 16 నుంచి వారు వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 13 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. వారి సమ్మెతో గ్రామీణ ప్రాంతాలలో రైతులు రుణాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.


