News January 8, 2026

పల్నాడు జిల్లాకు మణిహారంగా అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ!

image

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా నవ నగరాలు నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాకు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మించనుంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో భూ సమీకరణ ప్రారంభం సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయం వెల్లడించారు. 7,465 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పల్నాడు జిల్లాకు స్పోర్ట్స్ సిటీ మణిహారం కానుంది.

Similar News

News February 21, 2026

ANU పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో B.ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన I, lV 1వ, III/IV 5వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 30 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 16లోపు, రూ.100 ఫైన్‌తో 17లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.

News February 21, 2026

చిత్తూరులో బర్డ్ ప్లూ.. మనుషులకు సోకలేదు!

image

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మనుషులెవరికీ బర్డ్ ప్లూ సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండియన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి వ్యాధి సోకిందనే ప్రచారం అవాస్తవమన్నారు. 54 మంది అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపగా నెగిటివ్గా తేలిందన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News February 21, 2026

చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

image

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.