News January 8, 2026
ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే టెస్ట్ చేపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.
Similar News
News February 26, 2026
పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్(రాజస్థాన్)లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:10 గంటలకు విజయ్.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ సందర్భంగా అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ‘VIJAY DEVARAKONDA’ హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. సాయంత్రం మరోసారి ‘<<19227454>>కొడువ<<>>’ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
News February 26, 2026
127KGల గోల్డ్ స్కామ్.. నటి రన్యారావుకు షాక్

బంగారం స్మగ్లింగ్ కేసులో దాదాపు ఏడాదిగా జైలులో ఉన్న కన్నడ నటి <<15969980>>రన్యారావుకు<<>> మరో షాక్ తగిలింది. తాజాగా ED బెంగళూరులోని PMLA కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును ప్రస్తావించింది. రూ.102 కోట్ల విలువైన 127 కేజీల బంగారాన్ని రన్యారావు సిండికేట్ ముఠా దుబాయ్ నుంచి INDకు అక్రమంగా తరలించినట్లు తెలిపింది. కాగా గతేడాది మార్చి 3న 14.2 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ నటి దొరికిపోయిన విషయం తెలిసిందే.
News February 26, 2026
తిరుమలలో నేటి నుంచి తెప్పోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతాయి. మార్చి 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు దర్శనమిస్తారు. మొదటి రోజు శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు శ్రీకృష్ణస్వామి, చివరి 3 రోజులు మలయప్పస్వామి వారు తెప్పలపై విహరిస్తారు. ఈ వేడుకల కారణంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు కొన్ని ప్రత్యేక సేవలను TTD రద్దు చేసింది.


