News January 8, 2026
విగ్రహాల శుద్ధిలో ఏ పదార్థాలు వాడాలి?

దేవుడి విగ్రహాలను శుభ్రం చేయడానికి రసాయనాలు వాడకూడదు. పసుపు, కుంకుమ, విభూతి, నిమ్మరసం వంటి సహజ పదార్థాలు వాడటం ఉత్తమం. ముఖ్యంగా రాగి, ఇత్తడి విగ్రహాలను చింతపండు లేదా నిమ్మకాయతో తోమడం వల్ల అవి కొత్తవాటిలా మెరుస్తాయి. కడిగిన తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి, ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల విగ్రహాల శక్తి సడలకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి.. మంగళ, శుక్రవారాల్లో విగ్రహాలకు జల స్నానం చేయించడం నిషిద్ధం.
Similar News
News February 18, 2026
పూజ పూర్తయ్యాక ఈ తప్పులు చేస్తున్నారా?

దైవానుగ్రహం కలగాలంటే పూజ సమయంలోనే కాదు, పూజ తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. పూజ ముగిసిన వెంటనే కాళ్లు కడగకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. పూజ చేసిన రోజున మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. నైవేద్యాన్ని సమర్పించిన వెంటనే తీయకూడదు. కాసేపు అక్కడే ఉంచాలి. పూజలో, పూజానంతరం కోపతాపాలు మానాలి. ప్రశాంతంగా ఉంటే దైవశక్తి పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సానుకూలతను నింపుతాయి.
News February 18, 2026
BECILలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)లో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech,డిప్లొమా, ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జూనియర్ ఇంజినీర్‌కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా, సూపర్‌వైజర్, MTSపోస్టుకు 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com
News February 18, 2026
వరిలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

వరి పైరులో గింజ పాలుపోసుకునే దశలో కంకి నల్లి ఆశిస్తుంది. వీటి వల్ల ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నల్లగా మారతాయి. గింజలపై కూడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల గింజలు పాలు పోసుకోకుండా తాలుగా మారి పంట దిగుబడి 20-30% తగ్గే అవకాశం ఉంది. కంకినల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా స్పెరోమెసిఫిన్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో మందుమార్చి 2 సార్లు పిచికారీ చేయాలి.


