News January 8, 2026
GNT: కాలేజీ టాయిలెట్స్‌లో విద్యార్థి సూసైడ్.. కారణమిదేనా.?

గుంటూరులోని ఓ యూనివర్సిటీ విద్యార్థి రాఘవేంద్ర వెంకట్ బుధవారం కాలేజీ టాయిలెట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన <<18792920>>విషయం తెలిసిందే.<<>> తెనాలి (M) నందివెలుగుకి చెందిన అతడి ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాక్ లాగ్స్ కారణమని తెలుస్తోంది. రోజు మాదిరిగా కాలేజీకి వచ్చిన వెంకట్ మధ్యలో స్నేహితుడు బైక్ తీసుకొని వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని టాయిలెట్లో నిప్పు అంటించుకున్నట్లు సమాచారం.
Similar News
News February 1, 2026
ఖమ్మం: సీఐకు గాయం…పలువురిపై కేసు నమోదు

బందోబస్తు విధుల్లో ఉన్న వన్ టౌన్ సీఐ కరుణాకర్‌ను అడ్డుకుని, గాయపరిచిన పలువురిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పోయిలపొంగు ఉపేందర్, వెంకట్‌లను అరెస్టు చేసి కస్టడీకి తరలించినట్లు తెలిపారు. కార్యకర్తలు నమవరపు ఈశ్వర్, మాతేడి కిరణ్, భుక్య అశోక్, పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
News February 1, 2026
మహిళా సాధికారతకు సరికొత్త బాట ‘షీ మార్ట్’

కేంద్ర బడ్జెట్ 2026లో మహిళలను వ్యాపార యజమానులుగా మార్చేందుకు ‘షీ మార్ట్’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం పొందేలా మహిళలకు శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. స్థానిక పొదుపు సంఘాల్లో చేరి, నైపుణ్య శిక్షణ పొంది, బ్యాంకు రుణాల ద్వారా తమ వ్యాపార కలను సాకారం చేసుకోవచ్చు.
News February 1, 2026
పోలీసులు వేధించారని జడ్జి ఎదుట అంబటి ఆవేదన: YSRCP Legal Cell ట్వీట్

తనను పోలీసులు శారీరకంగా వేధించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సెల్ నుంచి బయటకు తెచ్చి కాళ్లు వెడల్పుగా చేయించి నిలబెట్టారని, దీనివల్ల తీవ్ర నొప్పులు వస్తున్నాయని కోర్టుకు తెలిపారు. తనపై దాడి జరిగినా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ పేర్కొంది.


