News January 8, 2026

మిర్యాలగూడ మహిళపై అత్యాచారం

image

భూమి పంచాయితీ పరిష్కరిస్తానని నమ్మించి ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. MLGకు చెందిన బాధిత మహిళ తన భూ సమస్యపై మునుగోడుకు చెందిన వ్యక్తిని ఆశ్రయించింది. అతడు ఆమెను దుప్పలపల్లి వద్ద ఉన్న ఎఫ్.సి.ఐ గోదాముల వెనుకకు తీసుకెళ్లి, కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 17, 2026

బిల్ గేట్స్ టూర్.. SMలో తీవ్ర విమర్శలు!

image

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నిన్న <<19155078>>అమరావతి<<>>లో పర్యటించడం తెలిసిందే. అయితే ఆయన భారత టూర్‌పై SMలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు చాలా సార్లు ఉండటమే ఇందుకు కారణం. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న అలాంటి వ్యక్తితో ఎవరూ భేటీ కాకూడదని MP కాంగ్రెస్ నేత అనూప్ ధోటే ట్వీట్ చేశారు. తన ఉత్పత్తుల కోసం ఇండియాను ల్యాబ్‌లా ఆయన చూస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

News February 17, 2026

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి సమన్వయంతో చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఉరవకొండ, గుంతకల్లు, ఆత్మకూరు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శిల్పారామం, గుత్తి కోట ఉత్సవాలు, బోటింగ్, హెరిటేజ్ వాక్ కార్యక్రమాలను నాణ్యతగా అమలు చేసి పర్యాటకులను ఆకర్షించాలని తెలిపారు.

News February 17, 2026

సంగారెడ్డి: రెండు నెలల్లో రేవంత్ పర్యటన

image

సంగారెడ్డి పట్టణంలో 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను సీఎంకు గిఫ్టుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.