News April 25, 2024

NZB: BJPలో చేరిన కోటపాటి నరసింహం

image

పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు, BRS పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు ఈరోజు BJP లో చేరారు. NZB MP ధర్మపురి అర్వింద్ ఆహ్వానం మేరకు BRS పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి సముఖత చూపడమే కాకుండా కేంద్ర మంత్రివర్గంతో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో BJPలో చేరినట్లు తెలిపారు.

Similar News

News January 7, 2026

NZB: ఖైదీలను కొట్టారని జైలు అధికారులపై వేటు..!

image

నిజామాబాద్ జిల్లా జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ, మరో జైలర్ సాయి సురేశ్‌ను ADB జైలుకు బదిలీ చేస్తూ జైళ్ల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా జైలర్లిద్దరూ తమను తీవ్రంగా కొట్టారని వారం రోజుల క్రితం జైలులోని ఇద్దరు ఖైదీలు చాకలి రాజు, కర్నే లింగం జడ్జికి తెలపడంతో ఈ విషయంపై జైలు శాఖ అధికారులు జిల్లా జైలుకు వచ్చి విచారణ చేపట్టి డీజీపీకి నివేదిక ఇవ్వగా వేటు పడిందని తెలిసింది.

News January 7, 2026

నిజామాబాద్ అంగన్‌వాడీల్లో నియామకాల జాప్యం..!

image

నిజామాబాద్ జిల్లాలో అంగన్‌వాడీల్లో నియామకాల జాప్యం సాగుతోంది. జిల్లాలో 1,501 ప్రధాన కేంద్రాలతోపాటు 135 మినీ కేంద్రాలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 76 టీచర్, 400 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఖాళీలను భర్తీ చేయాలని అటు సిబ్బంది, ఇటు లబ్ధిదారులు కోరుతున్నారు.

News January 6, 2026

NZB: నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

image

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో సీపీ సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. CMR కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలపై నిఘా పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు, స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి, శాంతిభద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.