News January 8, 2026

మిరప పంటకు తెగుళ్ల ముప్పు.. నివారణ ఎలా?

image

చలి తీవ్రత కారణంగా మిరప పంటలో తెగుళ్ల ముప్పు పెరిగింది. ముఖ్యంగా నల్లతామర పురుగులు పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇవి మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తున్నాయి. ఫలితంగా మొక్కల ఆకులు, కాయలు రాలి, పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతున్నాయి. నల్ల తామర పురుగులతో పాటు బూడిద తెగులు, పూత, కాయతొలుచు పురుగుల ఉద్ధృతి కూడా పెరిగింది. వీటి నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

Similar News

News February 15, 2026

$6.7B తగ్గిన విదేశీ మారక నిల్వలు

image

ఈ నెల 6తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు $6.711 బిలియన్లు తగ్గి $717.064Bకి చేరినట్లు RBI వెల్లడించింది. బంగారం నిల్వలు $14.208B తగ్గి $123.476B చేరడమే ఇందుకు కారణం. అంతకుముందు వారం ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రిజర్వ్స్ రికార్డు స్థాయిలో $723.774Bకి పెరిగాయి. ఇప్పుడు కాస్త తగ్గినా మొత్తంగా బలంగానే ఉన్నాయని RBI పేర్కొంది. అటు విదేశీ కరెన్సీ ఆస్తులు $570.053Bకి పెరిగాయని తెలిపింది.

News February 15, 2026

వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

image

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.

News February 15, 2026

హీరో నిఖిల్ వివాదాస్పద పోస్ట్.. ఎవరి గురించి?

image

హీరో నిఖిల్ నటించిన ‘స్వయంభు’ సినిమా నుంచి ఇటీవల ఎపిక్ టీజర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టెక్నికల్ సమస్య వల్ల ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో రీఅప్‌లోడ్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘యూట్యూబ్ భయ్యా ఎందుకిలా టెక్నికల్ గ్లిచ్ వచ్చేలా చేశావ్.. ఇటీవల రిలీజైన సినిమాల్లాగా మా మూవీలో AI యూజ్ చేయలేదు’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఎవరిని, ఏ సినిమాను ఉద్దేశించి ఇలా కామెంట్ చేశారనే చర్చ మొదలైంది.