News January 8, 2026
వామ్మో.. నాటుకోడి కేజీ రూ.2,500

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ. దీంతో కేజీ కోడి ధర రూ.2,000-2,500(గతంలో రూ.1,000-1,200) పలుకుతోంది. వైరస్‌ల కారణంగా నాటుకోళ్లను పెంచే వారి సంఖ్య తగ్గిపోవడంతో కొరత ఏర్పడింది. ఇదే అదునుగా యజమానులు రేట్లు భారీగా పెంచేశారు. అటు బ్రాయిలర్ చికెన్ రేటు కూడా రూ.300-350 పలుకుతోంది.
Similar News
News February 22, 2026
BREAKING: లొంగిపోయిన దేవ్‌జీ

ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి <<19197693>>సరెండర్<<>> అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. మార్చి 31నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్‌జీ, రాజిరెడ్డి టార్గెట్‌గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
News February 22, 2026
సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News February 22, 2026
తడి బట్టలతో పూజ చేయవచ్చా?

దైవకార్యాల్లో తడి బట్టలు ధరించకూడదు. అలా చేస్తే పితృదేవతలు ఆగ్రహానికి గురవుతారని నమ్మకం. ‘తడి బట్టల నుంచి కారే నీరు పితరులకు వెళ్తుందని, తద్వారా వారు అసంతృప్తి చెందితే సంతాన, సంపద లోపం కలుగుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. తడి బట్టలతో ఆలయ ప్రవేశం, పూజ చేయడం మహా పాపం. అపర కార్యాలకు మాత్రమే తడి బట్టలు నిషిద్ధం కాదు. కాబట్టి ఎప్పుడూ పొడి బట్టలతోనే పూజలు నిర్వహించాలి’ అని పండితులు చెబుతున్నారు.


